Airtel: DTH వ్యాపారాలను విలీనం చేసేందుకు టాటా గ్రూప్, ఎయిర్టెల్ చర్చలు 1 y ago
టాటా గ్రూప్ & భారతి ఎయిర్టెల్ తమ DTH వ్యాపారాలైన టాటా ప్లే & ఎయిర్టెల్ డిజిటల్ టీవీల విలీనం కోసం చర్చలు జరుపుతున్నాయని ET నివేదించింది. ఈ రెండు సంస్థల విలీనం తర్వాత వారి మొత్తం కార్యకలాపాల విలువ రూ.6,000-7,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. విలీన సంస్థలో ఎయిర్టెల్ 52-55% వాటాను, టాటా ప్లే & వాల్డ్ డిస్పీ సహా ఇతర వాటాదారులు 45-48% వాటాను కలిగి ఉంటారని నివేదిక తెలిపింది.